ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. అయితే.. కల్కి, సలార్, స్పిరిట్ వంటి అన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. వీటి మధ్యలో కాస్త తక్కువ బడ్జెట్‌తో మారుతితో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు.
Prabhas: Prabhas on the sets of 'Rajasaab'.. New Look Adurs!
Prabhas: రాజసాబ్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటుగా హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ షూటింగ్లో పాల్గొంటొంది. ప్రభాస్, నిధిలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగానే.. ప్రభాస్ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్‌లో లుక్‌లో కిర్రాక్ అనేలా ఉన్నాడు. డిఫరెంట్ గడ్డంతో కనిపిస్తున్నాడు.
ఈ వీడియో చూసిన అభిమానులు వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్.. అంటూ షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది రాజాసాబ్. ఈ ఒక్క వీడియో అనే కాదు.. గత నాలుగైదు రోజులుగా ట్రెండింగ్‌లోనే ఉంటోంది రాజా సాబ్. ఇక ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇదే విషయాన్ని తేజ సజ్జ కొత్త సినిమా ‘మిరాయ్’ అనౌన్స్మెంట్ సంందర్భంగా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్గాను అడగ్గా.. కల్కి రిలీజ్ అయిన తర్వాత అప్టేట్స్ ఉంటాయిని చెప్పుకొచ్చాడు. అయితే.. తేజ సజ్జ మాత్రం.. నాకెందుకో ఇమ్మీడియెట్‌గా రాజా సాబ్ సాంగ్ వస్తుందేమోనని అనిపిస్తోందని అన్నాడు. దీంతో.. త్వరలోనే రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చిన రావొచ్చని అంటున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి మారుతి ఈ సినిమా అప్టేట్ ఎప్పుడిస్తాడో చూడాలి.