MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీబీఐ కవితను విచారించనుంది. గత పదిహేను రోజులు ఈడీ విచారించింది. ఇప్పుడు సీబీఐ సైతం అదే తీహార్ జైలులో విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. గత ఏడాది సీబీఐ హైదరాబాద్‌లో ఉన్న కవిత నివాసంలో విచారించింది.
తాజాగా సీబీఐ కస్టడీకి తీసుకొని మరోసారి విచారించేందుకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానంలో అనుమతి తీసుకుంది. ఈ క్రమంలో కవితను ఈరోజు కస్టడీలోకి తీసుకుంది. పది రోజుల పాటు తమ కస్టడీకి కోరే యోచనలో సీబీఐ ఉంది. అయితే కవిత రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 16న కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ విచరాణ ఏం జరుగుతుంది, కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే కవితకు హై బీపీ ఉన్నట్లు దాని కోసం జైలులో ప్రత్యేక ఏర్పాటు చేశారని జైలు అధికారులు గతంలో తెలిపారు. ఇక తన చిన్న కుమారుడికి పరిక్షలు జరుగుతున్నాయని అందుకని బెయిల్‌కు అప్లై చేస్తే దాన్ని కోర్టు తిరస్కించిన విషయం తెలిసిందే.