»Truecaller Now Available On Web Check Out The Features
Truecaller : ట్రూ కాలర్ వెబ్ వెర్షన్ విడుదల
తెలియని ఫోన్ నెంబర్లు ఎవరివో తెలుసుకునేందుకు అంతా ఎక్కువగా ఉపయోగించే ట్రూ కాలర్ ఇక వెబ్ వెర్షన్లోనూ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Truecaller For Web : ఇటీవల కాలంలో చాలా మంది ట్రూ కాలర్ యాప్‌ని వేసుకుని వాడుతున్నారు. తెలియని నెంబర్ల ఐడీలను గుర్తించడం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఫోన్లలోనే అందుబాటులో ఉంది. అయితే దీన్ని వెబ్ వెర్షన్ తాజాగా విడుదలైంది. దీంతో ఇప్పుడు పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల్లోనూ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని ఫోన్ నెంబర్లు, మెసేజ్‌లు ఎవరు చేశారో తేలికగా తెలుసుకోవచ్చు.
ట్రూ కాలర్ వెబ్(Truecaller Web) వెర్షన్లో ఇప్పుడు రియల్ టైం నోటిఫికేషన్లను కూడా పొందవచ్చు. అయితే ఈ వెబ్ వెర్షన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ఇప్పుడు మీరు దీన్ని వాడేందుకు ఫోన్‌నే చూసే పని లేదు. చక్కగా ల్యాప్‌టాప్‌లోనూ నెంబర్ల సమాచారం వెతుక్కోవచ్చు. దీనికి కనెక్ట్ అయి ఉన్న ఫోన్‌కి వచ్చే మెసేజ్‌లను నేరుగా పీసీలోనూ చదువుకోవచ్చు. అక్కడి నుంచే రిప్లై ఇచ్చే అవకాశమూ ఉంది.
మీరు ట్రూకాలర్ వెబ్‌కు((Truecaller Web) కనెక్ట్ అవ్వగానే, మొబైల్లో అప్పటివరకు ఉన్న సందేశాలను ట్రూకాలర్ సెకన్లలో చూపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా కాంటాక్టు వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కీబోర్డు సాయంతో వేగంగా సందేశాలను పంపించవచ్చు. పైగా ఇవి మొబైల్ తరహాలోనే డెస్క్‌టాప్‌లోనూ ఎన్‌క్ట్రిప్ట్ అయి ఉంటాయి. కనుక మీ ప్రైవసీకి ఎలాంటి భంగం ఏర్పడదు.