Viral News: అమ్మాయి ఏంటీది..? ఇక్కడే పుట్టి, పెరిగి.. ఉండటం ఇష్టం లేదా..?
ఇండియాలో పుట్టి, పెరిగి.. కెనడాలో గ్రాడ్యుయేషన్ చేస్తోన్న ఏక్తా అనే యువతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. భారత దేశం నుంచి ఎప్పుడెప్పుడూ వెళ్లిపోవాలని అనుకుంటున్నానని పేర్కొంది. ఆమె తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Student Trolled: భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. ఇతర దేశాలు మన దేశానికి ఎంతో గౌరవం ఇస్తాయి. విభిన్న మతాలు, జాతులు, తెగల వారు ఇక్కడ నివసిస్తుంటారు. అందుకే దేశాన్ని ఉప ఖండం అని పిలుస్తారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అంతా విదేశాలకు వెళ్తున్నారు. ఫారిన్ అంటే తెగ లైక్ చేస్తున్నారు. సొంత దేశాన్ని కొందరు చులకన చేస్తున్నారు. విదేశీ మోజుతో.. సొంత దేశాన్ని తక్కువ చేస్తున్నారు. కింద ఉన్న వీడియోలో ఓ యువతి కూడా అలానే మాట్లాడింది. తనకు కెనడా అంటే ఇష్టం అని చెబుతోంది. అప్పటికీ ఫర్లేదు.. ఎప్పుడెప్పుడూ ఇండియా నుంచి వెళ్లాలని చూశానని చెప్పడం నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యింది.
ఆ వీడియోలో తనను తాను ఏక్తాగా (ekta) పరిచయం చేసుకుంది. కెనడా ఎందుకు వచ్చారు..? ఇక్కడ ఏం చేస్తున్నారని అడగగా.. బయో టెక్నాలజీలో డిగ్రీ (degree) చేస్తున్నానని వివరించారు. ఇక్కడే బిజినెస్ (business) చేస్తానని పేర్కొన్నారు. ఇండియాను వదిలి కెనడా రావడం తన కల అని చెప్పారు. ఇక్కడ ఏం నచ్చిందని అడగగా.. బ్యూటిఫుల్ సీనరి, సూర్యోదయం, సూర్యాస్తమయం బాగుందని వెల్లడించారు. తాను కెనడాలో ఉంటానని.. తిరిగి ఇండియా వెళ్లబోనని ఆమె మాటల్లో అర్థమైంది. ఆ వీడియో ట్విట్టర్లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
Sad that we don’t get to see sunrise and sunset in India.
ఏక్తా అలా అనడంతో ట్రూ కాలర్ నుంచి ఆమెకు జాబ్ ఆఫర్ వచ్చింది. ‘ఏక్తా మీ కలను నెరవేర్చుకొండి. మీ చదువు పూర్తయిన తర్వాత జాబ్ చేయాలని అనుకుంటే మా సంస్థ ఆహ్వానిస్తోంది. కెనడాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం ఇస్తాం. కానీ కొందరు ఏక్తాను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని’ ట్రూలర్ సీఈవో అలాన్ మామెడి ట్వీట్ చేశారు. భారత దేశంలో ఉండేందుకు ఇష్టపడని ఏక్తా తీరుపై సోషల్ మీడియాలో విమర్శల జాడివాన కురుస్తోంది. ఇంతలో అలాన్ జాబ్ ఆఫర్ ఇవ్వడంతో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు అతనిని అభినందించారు. మరికొందరు అయితే ఈ వివాదంలోకి మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఏక్తా (ekta) వైఖరిని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. ఇదీ సరికాదని మండిపడుతున్నారు.