PLD: చిలకలూరిపేట మండలం పసుపు గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు కారు, బైకు ఢీకొన్న క్రమంలో పసుమూరు గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.