MBNR: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ విమర్శలు తగవని జిల్లా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హరీష్ రావు మాట్లాడిన మాటలు అర్థరహితంగా ఉన్నాయని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారన్నారు.