»Satyavati Rathod Reacted To The News That The Brs Party Is Changing
Satyavati Rathod: కేసీఆర్ పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నా.. నేనెందుకు పార్టీ మారతా
పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై సత్యవతి రాథోడ్ స్పందించింది. ఆయనే మూడోసారి సీఎం కావాలని చెప్పులు లేకుండా పాదయాత్ర చేశానని, ఆయన పేరును సైతం పచ్చబొట్టు వేయించుకున్నట్లు తెలిపారు.
Satyavati Rathod reacted to the news that the BRS party is changing
Satyavati Rathod: బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్న నేపథ్యంలో ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా పార్టీ మారుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సైతం పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్ స్పందించింది. కొందరు స్వార్థంకోసం పార్టీ మారుతున్నారని, తాను అలా చేయానని స్పష్టం చేశారు. పార్టీ వీడుతున్న నేతలపై పలు విమర్శలు గుప్పించింది.
ఎన్నికల్లో ఓడిన తనను కేసీఆర్ ఎమ్మెల్యేసీ ఇచ్చి గిరిజన సంక్షేమ మంత్రిగా తనకు ఉన్నతమైన గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. మూడోసారి కూడా కేసీఆర్ సీఎం కావాలని చెప్పులు లేకుండా పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. కేసీఆర్ పేరును సైతం పచ్చబొట్టు వేయించుకున్నాని తెలిపారు. అలాంటిది తాను ఎలా పార్టీ మారుతానని ప్రశ్నించారు. కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటనే ఉంటానని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు పుకార్లు శికార్లు చేస్తున్నాయి. మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఆయన పార్టీ మారుతున్న వార్తలపై స్పందించిన విషయం తెలిసిందే. తాను పార్టీని వీడడం లేదని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని స్పష్టం చేశారు.