ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో రైల్వేకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. అసలు ఇలాంటివి నిజంగా జరుగుతాయా అని ఆలోచించేలా చేసే కొన్ని వీడియోలు ఉన్నాయి.
Viral News : ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో రైల్వేకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. అసలు ఇలాంటివి నిజంగా జరుగుతాయా అని ఆలోచించేలా చేసే కొన్ని వీడియోలు ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఒక వీడియోలో ఒక వ్యక్తి రైలు భోగిపై పడుకుని ప్రయాణిస్తున్నట్లు కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది.
ఆ యువకుడు రైలు పైకప్పుపై హాయిగా పడుకున్నట్లు వీడియోలో చూడవచ్చు. రైల్లో సీటు దొరకకపోవడంతో యువకుడు రైలు పైకప్పుపై పడుకుని ప్రయాణం చేయవలసి వస్తుంది. అతని పైన 25 వేల వోల్టుల కరెంట్‌ని మోసుకెళ్లే వైరు ఉంది, దాని కారణంగా అతడు కాలిపోయే ప్రమాదం ఉంది. అందుకే అతడు కొంచెం కూడా కదలకుండా 400కిలో మీటర్లు ప్రయాణిస్తాడు. ఇంత జరుగుతున్నా ఆ యువకుడికి ఏమాత్రం తేడా రావడం లేదు. హాయిగా పడుకుని ఉన్నాడు. ఈ వీడియో కాన్పూర్‌కి చెందినదని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వీడియో ఎక్కడిది అనే దాని గురించి స్పష్టమైన సమాచారం వెల్లడి కాలేదు.
हम कनपुरिये क्रांतिकारी होते हैं, हम इस देश मे न होते तो आज़ादी तक न मिलती। अब इन्हें देखो
सीट नहीं मिलने पर #कानपुर का एक शख्स ट्रेन की छत पर चढ़ गया, तेज रफ्तार और हाई टेंशन तारों के बीच करीब 400 किलोमीटर का सफर आराम से लेट कर पूरा किया.
कानपुर स्टेशन आया तो उतर कर चल दिये। pic.twitter.com/etzFfH7b4G