NRML: గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి బాసరలో పర్యటించి, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.