అల్లు అర్జున్, డైైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరోయిన్ సమంత నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సమంతతో చిత్ర బృందం చర్చలు జరపుతోందట.
Samantha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ట్యాలెంటెండ్ డైైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని దీనికి సంబంధించిన ఓ తాజా అప్డేట్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరోయిన్ సమంత నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సమంతతో చిత్ర బృందం చర్చలు జరపుతోందట. ఈమేరకు కోలీవుడ్ సినీ విశ్లేషకులు పోస్ట్‌లు పెడుతున్నారు.
దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ సమంత ఫిక్స్ అంటున్నారు విశ్లేషకులు. తాజాగా అట్లీ మాట్లాడుతూ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావించారు. ‘కచ్చితంగా ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తాను. నేను ఎప్పుడూ భిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాను. వేచి చూడండి సాలిడ్ మూవీ ఇస్తాను’ అని అన్నారు. అయితే ఆయన కామెంట్ అల్లు అర్జున్‌తో చేయబోయే మూవీ గురించే అని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే సమంత పాత్ర ఎలా ఉంటుంది అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇది పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా వస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న సీక్వెల్ చిత్రం ఇది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ కాగా ఫస్ట్ పార్ట్‌లో సమంత అల్లు అర్జున్‌తో కలిసి ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. అది సంచలనం సృష్టించింది. ఇక దర్శకుడు అట్లీ సైతం బిజీగానే ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్‌లతో ఓ చిత్రం సెట్స్ పై ఉంది. అలాగే షారుక్ ఖాన్ -విజయ్‌లతో ఓ మల్టీస్టారర్‌ను ప్రకటించారు. వీటితో పాటు కోలీవుడ్ హీరో అజిత్ కోసం కూడా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. వీటన్నింటి నడుమ బన్నితో ఈ ఏడాది అక్టోబర్‌లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.