»Tillu Square Was Very Afraid Sidhu Jonnalagadda Opened For The First Time
Sidhu JonnaLagadda: టిల్లు స్క్వేర్ ఎంతో భయపడుతూ చేశా.. మొదటి సారి ఓపెన్ అయ్యాడు
థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న టిల్లు స్క్వేర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు తాను ఎంతో భయపడ్డానని హీరో సిద్దు జొన్నల గడ్డ తెలిపారు. దీనికి కారణ్ డీజే టిల్లు చాలా మందికి నచ్చడమే అని పేర్కొన్నారు.
Tillu Square was very afraid Sidhu JonnaLagadda Opened for the first time
Sidhu JonnaLagadda: సిద్ధూ జొన్నలగడ్డ(Sidhu JonnaLagadda) హీరోగా, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran ) హీరోయిన్గా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం థియేటర్లో విజయవంతంగా దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా తీయాలని ప్లాన్ చేసినప్పుడు తాను చాలా భయపడ్డట్లు సిద్దు జొన్నలగడ్డ తెలిపారు. 2022 ఫిబ్రవరిలో డీజే టిల్లు సినిమా విడుదల అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత దానికి సీక్వెల్ ఉండబోతుంది అని అనౌన్స్ చేశారు. దాంతో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. దీనిపై సిద్దు ఓ ఇంటర్య్వూలో స్పందించారు.
టిల్లు స్క్వైర్(Tillu Square) చిత్రాన్ని మొదలు పెట్టాలంటే ముందు భయపడ్డాను, మన సొంతంగా ఏదైనా ఒక పనిని మొదలు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అని, ఎక్కడైనా పొరపాట్లు చేస్తున్నామా అని అనుమాన పడుతూనే ముందుకు సాగుతామని, ఇదే విషయం ఈ సినిమాకు ఎదురైంది అని సిద్దు పేర్కొన్నారు. ఎందుకంటే డీజే టిల్లు చాలా సక్సెస్ అయింది. ఈ సీక్వెల్ అందిరికి నచ్చుతుందా లేదా అనే భయం ఉంది.. అలాంటి భయం ఉండాలి కూడా అని వెల్లడించారు. చాలా మంది సినిమా ఇంత బాగుందని ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. అయితే మనం వండిన కూర మనమే బాగుందని చెప్పకూడదు, ఆ మాట తిన్నవాడు చెప్పాలి. అందకే మన సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులు చెబితేనే బాగుంటుంది అని అనుకున్నట్లు తెలిపారు. సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నారు అని కూడా అంటున్నారు. మాకు నచ్చే ఔట్ ఫుట్ వచ్చేవరకు చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.