»Mumbai Indians Rohit Sharma Was Out Ipl Cricket Lovers Quarreled Killed Chennai Super Kings Fan Of Ms Dhon
IPL 2024: రోహిత్ శర్మ ఔట్.. ధోనీ ఫ్యాన్ ను కొట్టి చంపిన అభిమానులు
ఐపీఎల్‌కు విదేశాల్లో ఎంత క్రేజ్ ఉందో భారత్‌లోనూ అంతే క్రేజ్ ఉంది. మ్యాచ్‌ల కంటే తమ ఫేవరెట్ క్రికెటర్లపైనే జనాలకు ఎక్కువ పిచ్చి. అయితే ఈ క్రేజ్ ఒకరి ప్రాణాన్ని తీసింది.
IPL 2024: ఐపీఎల్‌కు విదేశాల్లో ఎంత క్రేజ్ ఉందో భారత్‌లోనూ అంతే క్రేజ్ ఉంది. మ్యాచ్‌ల కంటే తమ ఫేవరెట్ క్రికెటర్లపైనే జనాలకు ఎక్కువ పిచ్చి. అయితే ఈ క్రేజ్ ఒకరి ప్రాణాన్ని తీసింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ వీక్షిస్తున్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత అభిమానుల మధ్య గొడవ జరిగి మ్యాచ్‌లోనే ఓ క్రికెట్ లవర్ ప్రాణాలు కోల్పోయాడు.
రోహిత్ శర్మ ఔటైన తర్వాత కోపంతో ఇద్దరు వ్యక్తులు క్రికెట్ లవర్ బండోపంత్ బాపుసో టిబిలే తల పగలగొట్టారు. దాని కారణంగా అతను మరణించాడు. ఈ ఘటనపై కర్వీర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మ్యాచ్‌లో రోహిత్ శర్మ అవుట్ అయినప్పుడు, బల్వంత్ మహదేవ్ ఝంజ్‌గే ( 50), సాగర్ సదాశివ్ ఝంజ్‌గే (35) సంబరాలు చేసుకుంటున్న బండోపంత్ బాపుసో టిబిలే( 63)ను దారుణంగా కొట్టారు. ఆ తర్వాత అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఐదు రోజుల క్రితం అంటే మార్చి 27న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత ధోనీ జట్టు అంటే చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని బందోపంత్ టిబిలే సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో బల్వంత్, సాగర్‌కు కోపం వచ్చింది. బందోపంత్పై ఘోరమైన దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తలకు బలమైన గాయమైంది. ఆ తర్వాత చనిపోయాడు.