NRPT: నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా సతీష్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గద్వాల టౌన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, గతంలో ఇక్కడ పనిచేసిన రాముడు స్థానంలో నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్సై సతీష్ రెడ్డి ఎస్పీ డాక్టర్ వినీత్ను కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.