NGKL: రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ పోర్టల్ మెయింటెనెన్స్ పనుల కారణంగా 2 రోజుల పాటు సేవలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో జిల్లాలో సర్టిఫికెట్లు, ఇతర ప్రభుత్వ సేవల లాగిన్లు పనిచేయవు. సోమవారం ఉదయం నుంచి సేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.