TG: రాష్ట్రంలో వాయిదా పడిన ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్ల ఎన్నికల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మూడు మున్సిపాలిటీల్లో ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.