»Ranbir Kapoor Rs 250 Crore Bungalow Gift For His Daughter
Ranbir Kapoor: రణబీర్ కపూర్ తన కూతురు కోసం ఏకంగా రూ. 250 కోట్ల బంగ్లా గిఫ్ట్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన కూతురు రాహా కోసం ఏకంగా రూ. 250 కోట్లు విలువ చేసే బంగ్లాను గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట్ల వైరల్గా మారింది.
Ranbir Kapoor: రణబీర్ కపూర్, అలియా భట్, నీతూ కపూర్ ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఓ విలాసవంతమైన బంగ్లాను సందర్శించారు. అత్యంత విలువైన ఆ బంగ్లాను రణబీర్ కపూర్ దగ్గరుండి మరీ డిజైనింగ్ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ బంగ్లాకు తన గారాల పట్టి రాహా కపూర్ పేరు పెట్టబోతున్నారు. ఓ బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. ఈ బంగ్లా నిర్మాణానికి రూ. ₹250 కోట్లు ఖర్చుపెట్టారని తెలిపింది. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రముఖుల ఇళ్లలో ఒకటిగా మారింది. అంతే కాదు రాహా పేరుమీద ఆ బంగ్లాను నిర్మించడంతో అత్యంత చిన్న వయసులో సంపన్నురాలుగా రాహా నిలిచింది.
బంగ్లా విలువ చూస్తే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ బంగ్లాల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. అంటే, బాలీవుడ్ టాప్ మోస్ట్ సెలబ్రిటీల బంగ్లాను అధిగమించి ముంబైలో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ భవనం ఇదేనని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రణ్ బీర్, అలియా ఇద్దరూ కలిసి కష్టపడి సంపాదించిన డబ్బును తమ డ్రీమ్ హౌస్ కోసం సమానంగా పెట్టుబడి పెడుతున్నారని మీడియా కథనాలు వెలువడ్డాయి. అత్యంత విలువైన ఈ బంగ్లా ఒక్కటే కాదు రణబీర్, అలియాలకు మరో నాలుగు విలువైన ఫ్లాట్లు కూడా ఉన్నాయి. వాటి విలువ దాదాపు రూ. 60 కోట్ల వరకు ఉండొచ్చు.