W.G: భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే పీజీఆర్ఎస్లో అధికారులు అందరూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.