NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.