కడప: ఖాజిపేట పట్టణంలోని సాయి బాబా గుడి వద్ద ఖాజీపేట మండల టీడీపీ నాయకులు ఏర్పాటు చేసినా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.