ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం అగ్నిమాపక సిబ్బంది భద్రత వారోత్సవాలు నిర్వహించారు. స్థానిక కొండబత్తుల వారి వీధిలో మహిళలకు వంట చేసుకునే టైంలో గ్యాస్ బండ లీక్ అవ్వడం ద్వారా జరిగే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను వివరించారు. ఈ భద్రత వారోత్సవాల కారణంగా ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై ఒక అవగాహన కలుగుతుందన్నారు.