ప్రకాశం: ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే కార్యక్రమాన్ని సీఐటీయు జిల్లా నాయకులు సయ్యద్ హనీఫ్ అన్నారు. ఆదివారం పామూరులో సీఐటీయు సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. మే ఒకటి తేదీన ప్రపంచ కార్మికుల దినోత్సవంలో అందరూ పాల్గొని జెండా ఆవిష్కరణలు ర్యాలీలు సభలు జరుపుకోవాలని కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు.