కృష్ణా: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి నాగపుట్టలో పాలు పోసి, సర్ప దోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.