»Chandini Chowdary Heroine Blackmailed To Come To The Guest House Shocked To Know Someone
Chandini Chowdary: హీరోయిన్ గెస్ట్ హౌస్‌కి రావాలంటూ బ్లాక్ మెయిల్.. ఎవరో తెలిసి షాక్?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు పడే బాధ అంతా ఇంతా కాదు. స్టార్ డమ్ వచ్చాక సంగతి పక్కకు పెడితే.. ఆ స్టార్ డమ్ రావడానికి ఎదురయ్యే సమస్యలు ఎన్నో ఉంటాయి. తాజాగా తెలుగు హీరోయిన్ను గెస్ట్ హౌస్‌కి రావాలంటూ బ్లాక్ మెయిల్ చేశారనే న్యూస్ వైరల్ అవుతోంది. కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది.
Chandini Chowdary: అక్కడ, ఇక్కడ అని కాదు.. అన్ని సినిమా ఇండస్ట్రీలలోను క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. స్టార్ హీరోయిన్లు తరచుగా చెబుతునే ఉంటారు. కొన్ని సార్లు ఆ వ్యవహారం రచ్చకెక్కిన సందర్భాలున్నాయి. పరభాష హీరోయిన్లే కాదు.. తెలుగు హీరోయిన్లు కూడా ఇలాంటివి అనుభవిస్తున్నారు. తాజాగా తెలుగు హీరోయిన్ చాందని చౌదరి కూడా ఇలాంటి సంఘటన ఎదురైందని చెప్పుకొచ్చింది. సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది చాందిని. అక్కడి నుంచి మంచి అవకాశాలు అందుకుంది. చివరగా విశ్వక్ సేన్ ‘గామి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాందిని నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే.. తాజాగా చాందిని ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ విషయాన్ని చెప్పుకొచ్చింది. తనకు ఒక రోజు కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందట. అందులో.. గెస్ట్ హౌస్‌కు రావాలని.. లేకుంటే తన ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారట. దీంతో చాందిని షాక్ అయిందట. ఏం చెయ్యాలో తోచక ఏడ్చేసిందట. కానీ చేసేది లేక ఇండస్ట్రీలో తన స్నేహితుల ఈ విషయాన్ని చెప్పిందట.
వాళ్ల సలహా మేరకు మెసేజ్ వచ్చిన నెంబర్‌కు ఫోన్ చేయగా.. అసలు మ్యాటర్ తెలిసి మరింత షాక్ అయిందట. అవతలి వైపు ఓ లేడీ గొంతు వినిపించదట. ఇండస్ట్రీలో టామ్ బాయ్‌గా పేరు తెచ్చుకు నటి స్నిగ్ధ.. ఇలా సరదాగా ఆటపట్టించదట. దీంతో తనని కలిసి ఒక్కటిచ్చినట్టుగా చెప్పుకొచ్చింది. చాందిని జరిగింది సరదాగానే అయినా.. చాలామంది హీరోయిన్లకు ఇలాంటి వేధింపులు నిజంగానే జరుగుతన్నాయనేది ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్.