»A Customer Booked Uber Auto In Noida Rs He Was Shocked To See The Bill Of 7 66 Crores
Uber Auto: ఊబర్ ఆటో బుక్ చేశాడు.. రూ. 7.66 కోట్ల బిల్లు చూసి షాక్ అయ్యాడు.
ఓ కస్టమర్ రూ. 62 కు ఒక ఊబర్ ఆటోను బుక్ చేసుకున్నాడు. తాను దిగల్సిన చోటు వచ్చింది. ఆటో దిగిన కస్టమర్ బిల్లు చూసి షాక్ అయ్యాడు. ఏకంగా 7 కోట్ల 66 లక్షలు వచ్చింది. అందులో డ్రైవర్ వెయిటింగ్ ఛార్జీ కూడా ఉంది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
A customer booked Uber Auto in Noida.. Rs. He was shocked to see the bill of 7.66 crores.
Uber Auto: ఉబర్‌లో ఆటో బుక్ చేసిన ఓ కస్టమర్‌కు భారీ షాక్ తగిలింది. ఆటో బుక్ చేసిన వ్యక్తి రైడ్ అయిపోయిన తరువాత బిల్లు చూసి షాక్ అయ్యాడు. తన రైడ్ బిల్లు రూ.7.66 కోట్లు అయినట్టు నోటిఫికేషన్ వచ్చేసరికి అతడి దిమ్మె తిరిగిపోయినట్టైంది. నోయిడాలోని దీపక్ తెనుగురియా అనే కస్టమర్ ఈ వింత పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అందులో డ్రైవర్ వెయిటింగ్ ఛార్జీ కూడా ఉంది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయం ఏంటంటే.. దిపక్ ఉబర్‌లో ఓ ఆటో బుక్ చేశాడు. మరి కాసేపట్లో తన గమ్యస్థానానికి చేరుకుంటాడనంగా అతడి బిల్లుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. తన ప్రయాణానికి దాదాపు రూ.62 బిల్లు అవుతుందనంగా రూ.7.66 కోట్లు అయినట్టు నోటిఫికేషన్లో కనిపించడంతో అతని మైండ్ బ్లాక్ అయింది. అతడి బిల్లులో ప్రయాణ చార్జీ రూ.1,67,74,647 కాగా… వెయిటింగ్ చార్జి రూ.5,99,09,189గా వచ్చింది. ప్రమోషనల్ ఆఫర్ కింద మరో 75 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇవ్వడం కొసమెరుపు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దీపక్ స్నేహితుడు నెట్టింట పంచుకున్నాడు. ఘటన వైరల్ కావడంతో ఉబర్ కూడా స్పందించి దీపక్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ సమస్యను పరిశీలిస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొంది.
सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t