»Seema Haider Court Notices To Seema Haider Is The Reason
Seema Haider: సీమా హైదర్‌కు కోర్టు నోటీసులు.. కారణమిదే!
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌కు నోయిడా కోర్టు నోటీసులు పంపింది. తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదని.. రెండో పెళ్లి చెల్లదనే విషయంలో కోర్టు నోటీసులు పంపింది.
Seema Haider: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ గురించి తెలిసిందే. నోయిడాకి చెందిన సచిన్ మీనాను ఆమె ప్రేమించిందని పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చింది. తర్వాత ఈమె సచిన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి విషయంలో నోయిడా కోర్టు సీమాకు నోటీసులు పంపింది. ఎందుకంటే సచిన్‌తో జరిగిన పెళ్లి చెల్లుబాటు కాదని ఆమె మొదటి భర్త గులాం హైదర్ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సీమా హైదర్‌కు నోటీసులు పంపింది. మే 27న కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. తర్వాత విచారణను కోర్టు మే 27కు వాయిదా వేసింది. సీమా హైదర్ గులామ్ హైదర్ నుంచి విడాకులు పొందలేదు. ఈకారణంతో ఆమెకు సచిన్‌తో జరిగిన పెళ్లి చెల్లదని గులామ్ తరపున న్యాయవాది తెలిపారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీమాకు నోటీసులు పంపింది.