Vijay Deverakonda: బాడీ గార్డ్‌కి షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
రౌడీ హీరో విజయ్ దేవరకొండకి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. రౌడీ ఏది చేసిన కూడా సెన్సేషన్. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ సొంతం. తాజాగా విజయ్ తన బాడీగార్డ్ పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అంటేనే ఓ సెన్సేషన్. ఈ రౌడీ హీరో ఏది చేసినా కూడా స్పెషల్‌గానే ఉంటుంది. లైగర్ సినిమా ఫ్లాప్ అయింది గానీ.. ఈపాటికే పాన్ ఇండియా క్రేజ్‌తో దూసుకుపోయేవాడు రౌడీ. అయితే.. విజయ్ సినిమాల కోసం చాలా కష్టపడ్డాడు. అందుకే.. ఆయన కాస్త యూత్ క్రేజ్ ఎక్కుగా ఉంటుంది. తన అభిమానుల కోసం విజయ్ ఏదో ఒకటి చేస్తునే ఉంటుంది. ఇది కూడా రౌడీ ఫాలోయింగ్‌కు ఒక కారణమని చెప్పాలి. కరోనా సమయంలో మిడిల్ క్లాస్ ఫండ్ ఇవ్వడం మొదలుకొని.. ప్రతి ఏటా పుట్టినరోజుకు ప్రత్యేకమైన గిఫ్టులు ఇస్తూ ఉంటాడు. అలాగే తనకోసం వచ్చిన అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. తాజాగా తన బాడీగార్డ్ పెళ్లికి వెళ్లి షాక్ ఇచ్చాడు విజయ్. రౌడీ దగ్గర రవి అనే కుర్రాడు పర్సనల్ బాడీ గార్డుగా పని చేస్తున్నాడు.
దీంతో తన పెళ్లికి విజయ్ ఫ్యామిలీ మొత్తాన్ని ఆహ్వానించాడు. అయితే.. విజయ్ బిజీగా ఉంటాడు కాబట్టి.. ఇలాంటి వాటికి వెళ్లే అవకాశాలు తక్కవు. కానీ రౌడీ మాత్రం తన కుటుంబంతో కలిసి రవి ఫ్యామిలీ మొత్తానికి ఒక స్వీట్ షాక్ ఇచ్చ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమా కాస్త తేడా కొట్టేసింది. దీంతో.. నెక్స్ట్ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.