Pushpa 2: గెట్ రెడీ.. ‘పుష్ప 2’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది!?
ప్రస్తుతం ఉన్న ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ సినిమాగా పుష్ప2 ఉంది. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ మరోసారి నేషనల్ అవార్డ్‌ను టార్గెట్ చేసేలా పుష్ప2 రాబోతోంది.
Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్‌కు ఊహించని పాన్ ఇండియా రిజల్ట్ ఇచ్చింది పుష్ప పార్ట్1. తెలుగులో కంటే నార్త్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించాడు పుష్పరాజ్. ఈ సినిమాతో ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. దీంతో పుష్ప2 పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది. ఇక పుష్ప2 టీజర్ అంతకుమించి అనేలా ఉంది. బన్నీ అమ్మవారి గెటప్‌కు థియేటర్లు బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాయి. దీంతో.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా.. అని ఆడియన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగష్టు 15న పుష్ప2 గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఒక్క ఇండియాలోనే 5 వేల థియేటర్లలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
దీంతో.. ఖచ్చితంగా పుష్ప 2 నెవర్ బిఫోర్ రికార్డులు క్రియేట్ చేయబోతోందనే చెప్పాలి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది పుష్ప2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది. ఓ సాంగ్ షూట్లో పుష్ప2 టీమ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పుష్ప2 నుంచి మరో టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్గా.. మే ఫస్ట్ వీక్‌లో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసే అవకాశముందని సమాచారం. అంతేకాదు.. అందుకు సంబంధించిన అప్డేట్ ఈ వారంలోగా రానున్నట్లు టాక్. ఇదే నిజమైతే.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి. మామూలుగానే సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్‌ది డెడ్లీ కాంబినేషన్. అలాంటిది.. మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2 మ్యూజిక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.