KRNL: ఎమ్మిగనూరులో నిరుద్యోగులు ఎస్.ఈని కలిసి జేఎల్ఎం, ఏఈ పోస్టులను వెంటనే విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేయాలని ఇవాళ వినతి పత్రం అందించారు. ఐటీఐ, ఆస్పిరెన్స్ నాయకులు మాట్లాడుతూ.. చాలా కాలంగా ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల వయోపరిమితి కూడా మించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని పోస్టులను భర్తీ చేయాలని కోరారు.