ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టుకు రూ.2000 కోట్లు నిధులు కేటాయించి, నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పామూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల తాగునీరు, సాగునీరు అవసరాలకు వెలుగొండ ప్రాజెక్టే కీలకమన్నారు.