బాలీవుడ్ నటి సన్నీలియోన్ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐదారు సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు షూటింగ్ జరుగుతుండగా ఆమె కుడికాలి బొటన వేలికి గాయం అయ్యింది. వేలి నుంచి రక్తం బయటకు రావడంతో అక్కడున్న సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేశారు. కాలి వేలికి దెబ్బతగలడమే కాకుండా ఆమె పెదవి కూడా కొద్దిగా చితికినట్లు తెలుస్తోంది. నొప్పిని భరించలేక సన్నిలియోన్ చాలా ఇబ్బంది పడిందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లుగా వెల్లడించింది.
చికిత్స సమయంలో తనకు ఇంజెక్షన్ వేయొద్దని సన్నిలియోన్ సిబ్బందిని కోరిందని, గాయాన్ని కూడా నెమ్మదిగా క్లీన్ చేయాలంటూ ఏడుస్తూనే చెప్పిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇదిలా ఉండగా సన్నిలియోన్ కాస్ట్యూమ్స్ చూస్తుంటే ఆమె సినిమాలో డీగ్లామర్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సన్నిలియోన్ కు గాయం అయినట్లు తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.