ఏజెంట్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి.. మాస్ ఫాలోయింగ్ పెంచుకోవాలని చూస్తున్నాడు అక్కినేని అఖిల్. అయితే అఖిల్ నెక్ట్స్ స్టెప్ ఏంటి.. ప్రజెంట్ ‘ఏజెంట్’ ఏం చేస్తున్నాడు.. అసలు ఏజెంట్ మూవీ రిలీజ్ ఎప్పుడు.. ఇలాంటి ఎన్నో సందేహాలు అభిమానుల్లో వెలువడుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు అఖిల్. అందుకోసం గట్టిగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే థియేటర్లోకి రావాల్సింది ఏజెంట్. కానీ ఆగష్టు 12 నుంచి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాకు.. ఇప్పటి వరకు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతునే ఉన్నాయి. దాంతో అసలు ఏజెంట్ ఎప్పుడు రాబోతోంది అనేది సస్పెన్స్‌గా మారింది. అంతేకాదు ఈ ఏడాది ఏజెంట్ విడుదల ఉంటుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఏజెంట్ తర్వాత అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. తాజాగా అఖిల్‌తో కలిసి కింగ్ నాగార్జున ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఇది నిజమేనంటున్నారు. అది కూడా కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ ఆఫీస్‌లో ప్రత్యక్షమయ్యాడు నాగ్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. నాగ్ ‘బ్రహ్మాస్త్ర’లో నటించాడు కాబట్టి ముంబై వెళ్లాడనుకుంటే ఓకే.. కానీ అఖిల్ ఎందుకు వెళ్లాడనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికైతే అఖిల్ విషయంలో నాగార్జున ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ది ఘోస్ట్’ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తన 100వ సినిమా కోసం నాగ్ కథలు వింటున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే.