W.G: ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసి గెజిట్ ప్రకటించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షాన్ని ప్రకటించారు. గురువారం పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జయహో థాంక్యూ పీఎం అంటూ నినాదాలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు.