ASR: గిరిజన యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, క్రీడల్లో రాణించి, ఉన్నతస్థాయికి చేరుకోవాలని పాడేరు డీఎస్పీ అభిషేక్ సూచించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు గురువారం జీ.మాడుగుల మండలం మద్దిగరువు గ్రామంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్లో గెలుపొందిన మద్దిగరువు టీంకు రూ.10వేలు, మడతకొండ టీంకు రూ.5వేలు చొప్పున బహుమతులు అందజేశారు.