AKP: మునగపాక మండలం వాడ్రాపల్లిలో తాగునీటి సమస్యను గ్రామీణ మంచినీటి విభాగం అధికారులు పరిష్కరించినట్లు తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్ల వరహా నర్సింగరావు తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారన్నారు.