ASF: దహెగాం మండలం ఖర్జి పెద్ద చెరువు మరమ్మతులకు ప్రభుత్వం రూ.5.87 కోట్లు కేటాయించింది. రెండేళ్ల క్రితం వరదలకు చెరువు దెబ్బతినడంతో సాగునీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందులపై స్పందించి ఈ నిధులు మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. పునరుద్ధరణ ద్వారా 600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.