AP: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్.రంగాపురంలో పొంగమంచుతో కనపడక ఎద్దులబండిని బైకు ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరు మృతిచెందగా.. మరో యువకుడికి గాయాలయ్యాయి. వీరు స్థానిక పరిశ్రమలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని.. విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన యువకుడిని సమీప ఆస్పత్రికి తరలించారు.