తిరుప్పరంగుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సమర్థించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది. అల్లర్లు జరుగుతాయన్న సాకుతో కోర్టు తీర్పును అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ, శాంతిభద్రతల పేరుతో అనుమతి నిరాకరించడం సరికాదన్నారు.