కొంతమందికి తరచుగా ఐస్ ముక్కలు తినాలనిపించడం ఒక సాధారణం. ఈ అలవాటును ‘పగోఫాగియా’ అంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇది ఐరన్ లోపం లేదా రక్తహీనతకు సంకేతం కావొచ్చని వారు తెలిపారు. ఐరన్ లోపం ఉన్నవారు ఐస్ తినడం వల్ల తక్షణమే చురుగ్గా అనిపిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఐస్ తినాలనిపించే ప్రతి ఒక్కరికీ పోషకాహార లోపం లేదా ఐరన్ లోపం ఉందని భావించకూడదు.