విజయనగరం స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో ఈనెల 11వ తేదిన పారా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నామని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పోటీలకు సంబందించిన కరపత్రాలు ఆవిష్కరించారు.17 ఏళ్ళు నిండిన దివ్యాంగ క్రీడాకారులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత ఉంటుందన్నారు. వివరాలకు 9849377577 సంప్రదించాలన్నారు.