TG: పోచారం ఇన్ఫోసిస్ సంస్థ విస్తరణ ద్వారా 17 వేల మందికి, విప్రో ద్వారా 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని చెప్పారు. ఇప్పటికే 70 జీసీసీలు వచ్చాయన్నారు. సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ముందుకెళ్తున్నామని తెలిపారు. IT కంటే ఎక్కువగా ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు.