కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీలో నటి రుక్మిణి వసంత్ భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆమె ‘మెలిసా’ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2026 మార్చి 19న విడుదల కాబోతుంది.