విశాఖలో జరిగిన CITU 18వ అఖిలభారత మహాసభలను కార్మికవర్గం, ప్రజలు, మీడియా ఘనంగా ఆదరించాయని రాష్ట్ర కమిటీ తెలిపింది. బుధవారం జగదంబ CITU కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నాశనం చేసే కేంద్ర విధానాలను ఖండిస్తూ తీర్మానం ఆమోదించామన్నరు. లేబర్కోడ్ల రద్దుకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.