KDP: బైక్ అదుపు తప్పి కింద పడటంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దన పాడు వద్ద జరిగింది. వీరపునాయునిపల్లె మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మునిశేఖర్(58)గా స్థానికులు తెలిపారు. వ్యక్తిగత పని నిమిత్తం ఎర్రగుంట్లకు బైక్పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.