KDP: ఎర్రగుంట్ల అన్న క్యాంటీన్‌ను మంగళవారం ఉదయం మున్సిపల్ ఛైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, కమిషనర్ శేష ఫణి ఆకస్మిక తనిఖీ చేశారు. అల్పాహారం తింటున్న వారితో స్వయంగా మాట్లాడారు. నిర్వాహకుల సేవలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం నిర్వాహణ జరగాలని సిబ్బందికి సూచించారు. శుభ్రత పాటిస్తూ శుద్ధి చేసిన తాగునీటిని అందించాలని ఆదేశించారు.