విశాఖ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ‘నీ తోడు’ సొసైటీ సహకారంతో ఏర్పాటైన ట్రాన్స్జెండర్ల క్యాంటీన్‌ను పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ల నిర్వహణలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు అప్పలరాజు, అంబేద్కర్, తదితరులు పాల్గొన్నారు.