PLD: నాదెండ్ల మండలం ఇర్లపాడులోని కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాల కోలాహలం మొదలైంది. నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పెద్ద తరలివస్తున్నారు. సీట్లు పరిమితంగా ఉన్నా, విద్యార్థుల భవిష్యత్తు కోసం దరఖాస్తులు సమర్పించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో పాఠశాల ప్రాంగణం విద్యా పండుగను తలపిస్తోంది.