Gummanuru Jayaram: వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ నుంచి విడిపోతున్నట్లు గుమ్మనూరు జయరాం పక్రటించారు. అలాగే మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జ్ల మార్పుల్లో ఆయనకు సిట్టింగ్ సీటు దక్కలేదు. ఎంపీగా పోటీ చేయమని హైకమాండ్ ఆదేశించింది. దీంతో జయరాం పార్టీ నుంచి వీడుతున్నట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలో టీడీపీ ఆధ్యర్యంలో జయహో బీసీ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో జయరాం పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఆయనకి టీడీపీ గుంతకల్ సీటు కేటాయిస్తుందని సమాచారం. జగన్ విధానాలతో విసిగిపోయానని జయరాం అన్నారు.