Best Sleeping Positions : మీరు సరైన పొజిషన్లో నిద్రపోతున్నారా? లేకపోతే కష్టమే
మనం రోజూ మంచం మీద ఎలా పడుకుంటున్నాం? అనేది మన నిద్ర నాణ్యతను నిర్ణయిస్తుంది. అలాగే మన వెన్నెముక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. మరసలు ఎలా పడుకుంటే మంచిదో తెలుసుకుందామా?
Best Sleeping Positions : సాధారణంగా మనం అంతా తలగడ వేసుకుని వెల్లెకిలా నిదానంగా పడుకుంటుంటాం. లేదంటే పక్కకు తిరిగి నిద్రపోతాం. ఇలా ఎలా పడుకున్నా మెడ వరకు వెన్నెముక నిదానంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అది దీర్ఘ కాలంలో వెన్ను నొప్పికి కారణమవుతుంది. శరీరాన్ని నిదానంగా ఉంచి వెల్లకిలా పడుకోవడం వల్ల వెన్నెముక రాత్రంతా నిదానంగా ఉంటుంది. అందువల్ల నడుం నొప్పుల్లాంటివి రాకుండా ఉంటాయి. అయితే వేసుకునే తలగడ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది మరీ ఎత్తుగానూ ఉండకూడదు. మన మెడ ఒంపులో సరిగ్గా అమిరిపోయేదై ఉండాలి. అప్పుడది మెడ దగ్గర సపోర్ట్‌గా ఉంటుంది. దీంతో మెడ నొప్పులు లాంటివీ రాకుండా ఉంటాయి.
పక్కకు తిరిగి పడుకున్నప్పుడు మోకాళ్ల మధ్య దిండు పెట్టుకోవడం వల్ల వెన్నెముక నిదానంగా ఉంటుంది. దిండును పెట్టుకోకపోతే వెన్నెముక వంకరగా ఉంటుంది. అది సరైన నిద్ర భంగిమ కాదు. దీని వల్ల దీర్ఘకాలిక వెన్ను సమస్యలు రావచ్చు.
పై రెండు భంగిమల్లో కాకుండా మరే భంగిమైనా సరే వెన్నెముక అమరికలో తేడా వస్తుంది. నిదానంగా ఉండదు. కొందరు బోర్లా పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల శరీరంలోని నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. కొందరు కాళ్లను అస్తవ్యస్తంగా పెట్టి నిద్రిస్తుంటారు. ఎలా పడుకున్నా వెన్నెముక ఏ భంగిమలో ఉంది అనే దానిపై దృష్టి ఉంచండి. ఎలా పడుకుంటున్నాం అనే విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోండి.