»Admission In First Class Only After Completing Six Years Central Govt
first class Admission: ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్
ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్లు తప్పనిసరి అనే నూతన విద్యా విధానం ప్రవవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.
first class Admission: పిల్లలకు మాటలు కూడా సరిగా రాకుండానే పాఠశాలలో జాయిన్ చేస్తున్నారు తల్లిదండ్రులు. దీని వలన పిల్లల బాల్యంపై ప్రభావం పడుతుందని జాతీయ అధ్యయనాలు వెల్లడించిన నేపథ్యంలో కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇవ్వాలని తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలు రూపొందించాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరి అని ఆ లేఖలో పేర్కొంది. నూతన విద్యా విధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. అయితే ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలకే కాదు ప్రైవేటు బడులకు కూడా వర్తిస్తుంది. ఈ మధ్య 2 సంవత్సరాలు దాటిన పిల్లలను శిశు స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఆ తరువాత నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదిపిస్తున్నారు. ఇక పిల్లలు ఒకటో తరగతికి వచ్చేసరికి పిల్లలకు 5 నుంచి 6 ఏళ్లు ఉంటాయి అని పేరెంట్స్ చెబుతున్నారు.