»Sammakka Sarakka Jatara Rtc Bus Passengers Consumed Alcohol
Viral Video : మందేస్తూ.. చిందేయ్.. రా.. బస్సులో మందు తాగుతున్న జనాలు వీడియో వైరల్
సమ్మక్క సారక్కల మేడారం మహా జాతర వైభవంగా సాగుతోంది. 4వ రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు మేడారానికి తరలివచ్చారు. భక్తుల రద్దీ కొనసాగుతోంది.
Viral Video : సమ్మక్క సారక్కల మేడారం మహా జాతర వైభవంగా సాగుతోంది. 4వ రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు మేడారానికి తరలివచ్చారు. భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో మేడారం జాతరకు టీఎస్ ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అయితే ‘సమ్మక్క సారక్క జాతర ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. మహిళలు ప్రయాణంలో ఉండగా, ఆ బస్సులో కొందరు పురుషులు కింద సీట్లలో కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఈ వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ వేదికగా ఆర్టీసీ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రజా రవాణాలో మద్యం సేవించడంపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేయగా, మరికొందరు ఇది తెలంగాణ సంప్రదాయమని సెటైర్లు వేశారు. ‘చూడండి సార్.. మన ఆర్టీసీ బస్సు ఎంత మందికి, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో? ఇలాంటి సౌకర్యాలు ఎవరూ చూడలేదంటూ ఓ నెటిజన్ టీఎస్ఆర్టీసీని ట్యాగ్ చేశాడు. తెలంగాణలో డ్రగ్స్ తీసుకోవడం మామూలే అని మరో నెటిజన్ రాశారు. ఆర్టీసీ బస్సును రాష్ట్ర ప్రభుత్వం బార్ షాప్ చేసినట్లు ఉందని మరో నెటిజన్ కామెంట్స్ చేశారు.